Business

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు!

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు!

నగరంలో వరుస హత్యలు, గొడవలతో పోలీసులు కొన్నాళ్లుగా కఠిన చర్యలు చేపట్టారు. నిబంధన ప్రకారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్ల కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయాన్ని మించి కార్యకలాపాలు సాగించిన వారిపై కేసులు నమోదుచేశారు. అర్ధరాత్రి దాటాక రోడ్లపై ఇష్టానుసారం సంచరిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల తీరుపై వ్యాపార వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. శాసనసభ సమావేశాల్లో ఇదే విషయం పలుమార్లు ప్రస్తావనకు రావటంతో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో దుకాణాలు తెరిచే ఉండొచ్చంటూ వ్యాపార వర్గాలకు తీపికబురు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z