Sports

ఓడిన సింధు. చెదిరిన హ్యాట్రిక్ కల.

ఓడిన సింధు. చెదిరిన హ్యాట్రిక్ కల.

పారిస్ ఒలింపిక్స్‌లోనూ (Paris Olympics 2024) పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధుకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. చైనీస్‌ ప్రపంచ నంబర్ 9 ర్యాంకర్‌ బింగ్‌ జావో రన్ చేతిలో 21-19, 21-14 తేడాతో ఓటమిపాలైంది. 56 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేముల్లో సింధు ఓటమిపాలైంది. డిఫెన్స్‌లో తప్పులు చేయడం వల్ల ఓడినట్లు పీవీ సింధు వెల్లడించింది. రియోలో వెండి, టోక్యోలో కాంస్యం సాధించిన సింధు ఈ దఫా మరోసారి గెలవాలని చేసిన పొరాటం వృథా అయింది. హ్యాట్రిక్ కల చెదిరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z