NRI-NRT

సిలికానాంధ్ర కూచిపూడి సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డ్ ప్రారంభం

సిలికానాంధ్ర కూచిపూడి సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డ్ ప్రారంభం

సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడిలో నిర్వహిస్తున్న సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డును ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. వైద్యం వ్యాపారంగా మారిన నేటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు చేస్తున్న సిలికానాంధ్ర సంస్థను మంత్రి అభినందించారు. ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిర్విరామంగా సేవ చేస్తున్న సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, ఆసుపత్రి ఛైర్మన్ కుచిభొట్ల ఆనంద్ ని ఆయన అభినందించారు.

ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు ₹10కోట్లకు చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ప్రభుత్వ మార్పులతో మరుగున పడిన ఆ జీవోను పునరుద్ధరిస్తామని మంత్రి హామీనిచ్చారు. ఆసుపత్రికి పన్ను మినహాయింపు గురించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌కు సూచిస్తానని సత్యకుమార్ తెలిపారు.

ఆనంద్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో 7విభాగాల్లో NTR వైద్యసేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, దానిలో భాగంగానే ఈ రోజు నుండి నూతనంగా ధన్వంతరి వార్డ్ ద్వారా మరో 30పడకలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో సభాద్యక్షులుగా పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజ, ఆత్మీయ అతిధులుగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, TV9-RTV ఫౌండర్ రవిప్రకాష్, హాస్పిటల్ అడ్మనిస్ట్రేటివ్ ఆఫీసర్ జె.హనుమకుమార్, కృష్ణ జిల్లా DMHO గీతాబాయ్, కూచిపూడి గ్రామ సర్పంచ్ కె.విజయలక్ష్మి, సంజీవని హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది, హాస్పిటల్ సలహా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z