DailyDose

సోషల్ మీడియా పిచ్చితో స్టంట్లు…మహిళ మృతి-CrimeNews-Aug 03 2024

సోషల్ మీడియా పిచ్చితో స్టంట్లు…మహిళ మృతి-CrimeNews-Aug 03 2024

* సోషల్‌ మీడియాలో (Social Media) లైక్‌ల కోసం యువత విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. ఫీట్లు చేస్తూ..ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏళ్ల బాలుడు, తన స్నేహితులతో కలిసి స్కూల్‌కు డుమ్మా కొట్టి.. కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై కారుతో స్టంట్లు చేశాడు. అదే సమయంలో ఓ మహిళ తన కుమార్తెతో స్కూటీపై వస్తుండగా కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో తల్లీకుమార్తెలిద్దరూ గాల్లోకి ఎగిరి పడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాలుడిని, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

* బాపట్ల రైల్వే స్టేషన్‌లో మతి స్థిమితం లేని బాలుడు హల్‌చల్‌ చేశాడు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బాపట్ల రైల్వే స్టేషన్‌కు రాగానే.. అప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్‌ బోగిపైకి ఎక్కాడు. అనూహ్య ఘటనతో నివ్వెరపోయిన రైల్వే యంత్రాంగం వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి అతి కష్టం మీద అతన్ని కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాల పాటు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను బాపట్లలో నిలిపివేశారు. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో బాలుడికి పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. అతని వద్ద ఆధార్‌ కార్డు లభ్యం కావడంతో వివరాలు సేకరించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని బాలసదన్‌కు తరలించారు.

* చండీగఢ్‌ (Chandigarh) న్యాయస్థానంలో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై అతడి మామయ్య కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. హర్‌ప్రీత్ సింగ్ నీటిపారుదల శాఖలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడి మామ మాల్విందర్‌ సింగ్‌ సిద్ధూ పంజాబ్ పోలీసు అసిస్టెంట్‌ ఐజీగా పని చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు. కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య కలహాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. వారి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సెషన్‌కు హాజరయ్యారు.

* పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్‌(Tehsildar) , ఇద్దరు ప్రైవేట్‌ సిబ్బందిని ఏసీబీ (ACB) అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కల్వశ్రీరాంపూర్‌ మండల తహసీల్దార్‌ మహ్మద్‌ జాహెద్‌ పాషా(Mohammed Zahed Pasha)తో పాటు అతడి వద్ద ప్రైవేట్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాసరి ధర్మేందర్‌, ప్రైవేట్‌ డ్రైవర్‌ మహ్మద్‌ అంజాద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కడెం తిరుపతి అనే వ్యక్తి తన తండ్రిపేరుపై ఉన్న పట్టాను తనపై మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పుస్తకం మ్యాన్‌వల్‌గా తనకు ఇవ్వాలని తహసీల్దార్‌ను సంప్రదించాడు. దీంతో డబ్బులు డిమాండ్‌ చేయగా శనివారం దాసరి ధర్మేందర్‌ రూ . 3 వేలు, డ్రైవర్‌ మహ్మద్‌ అంజాద్‌ రూ. 7 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇద్దరిని పట్టుకున్నారు. ఈ కేసులో తహసీల్దార్‌ మహ్మద్‌ జాహెద్‌ పాషా ప్రమేయం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని అధికారులు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z