NRI-NRT

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడోసారి మెగా వైద్య శిబిరం

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడోసారి మెగా వైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నాడు తానా ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 650మందికి ఉచితంగా వైద్యసేవలందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్విరామంగా నిర్వహ్సితున్నామని, ఇది ఈ క్రమంలో ఏడో సారని ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ వల్లేపల్లి తెలిపారు.

ఈ వైద్యశిబిరానికి గౌతమ్‌ అమర్నేని దాతలుగా వ్యవహరించారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన పేదలకు ఈ శిబిరంలో 26 మంది వైద్యుల బృందం ఆర్ధోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌ సేవలను అందజేశారని సమన్వయకర్త యెండూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. శిబిరం నిర్వహించడం పట్ల తానా అధ్యక్షుడు నిరంజన్ హర్షం వెలిబుచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z