మేషం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది.
వృషభం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిథునం
ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.
కర్కాటకం
కీలక వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
సింహం
జన్మస్థ చంద్ర బలం అనుకూలంగా ఉంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం.
కన్య
ద్వాదశ చంద్ర బలం అనుకూలంగా లేదు. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది.
తుల
సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం.
వృశ్చికం
దశమస్థ చంద్రబలం అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.
ధనుస్సు
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
మకరం
మంచి మనస్సుతో చేసే పనులు నెరవేరుతాయి. బంధువులతో అతిచనువు వద్దు. ఆర్ధికంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కుంభం
ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
మీనం
అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మంచిది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z