NRI-NRT

Texas NRI TDP: ఆస్టిన్‌లో కూటమి విజయోత్సవ సంబరాలు

Texas NRI TDP: ఆస్టిన్‌లో కూటమి విజయోత్సవ సంబరాలు

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాంతం చేసుకున్న సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర ఆస్టిన్‌లోని ఎన్నారై తెదేపా శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. 500 మందికి పైగా కూటమి NRI అభిమానులు, కార్యకర్తలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, స్వరాంజలి టీం పాటలు అలరించాయి. రాజకీయ నాయకుల విశేషాలతో కూడిన క్విజ్ ట్రివియా వంటి ఆటలు ఆకట్టుకున్నాయి. విందు భోజనం ఏర్పాటు చేశారు.

నూజివీడు శాసనసభ్యులు, హౌసింగ్ మరియు సమాచార శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అద్దంకి శాసనసభ్యులు-విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవిలు జూమ్ ద్వారా అభిమానులకి తమ సందేశాన్ని వినిపించగా, తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఉండి శాసనసభ్యులు కారుమూరు రఘురామకృష్ణంరాజు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డిలు అంతర్జాలం ద్వారా తమ సందేశాలను వినిపించారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. ఆస్టిన్ ఎన్నారై తెదేపా అధ్యక్షుడు లెనిన్ ఎర్రం మాట్లాడుతూ ఈ విజయంలో ప్రవాసులు కీలకంగా వ్యవహరించారని, సాంకేతికంగా కావాల్సిన సహాయ సహకారాలను అందించారన్నారు. మరో పదేళ్ల పటు సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. జనసేన నాయకులు ప్రసాద్ చిగిలిశెట్టి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సుమంత్ పుసులూరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని, అరాచకాల్ని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం తెలుగుదేశం వల్లే సాధ్యమని, చంద్రబాబు లాంటి సమర్థుడిని ఎన్నుకుని ప్రజలు రాష్ట్రాన్ని మరో బీహార్ కాకుండా కాపాడుకున్నారని కొనియాడారు. కార్యకర్తలు ప్రాణం పెట్టి పని చేశారని, ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ ఎన్నికల్లో పాల్గొనడం ముదావహమని కొనియాడారు.

కార్యక్రమంలో హరి బాచిన, ఉదయ్ మేక, ప్రసాద్ కాకుమాను, శ్రీధర్ పోలవరపు, సుమంత్ పుసులూరి, బాలాజీ పర్వతనేని, చిరంజీవి ముప్పనేని, శివ తాళ్లూరి, చరణ్ బెజవాడ, యశ్వంత్ పెద్దినేని, విజయ్ దొడ్ల, రామకృష్ణ నేలపాటి, కార్తీక్ గోగినేని, రవి కొత్త, సదా చిగురుపాటి, సాంబ వెలమ, కృష్ణ ధూళిపాళ్ల, సతీష్ గన్నమనేని, బాలాజీ గుడి, మాధవ్ జాలాది, రఘు దొప్పలపూడి, సురేంద్ర అప్పలనేని, శ్రీని బైరపనేని, నరేష్ కాట్రగడ్డ, రంగ గాడిపర్తి తదితరులు సమన్వయపరిచారు. మహిళలు, పిల్లలు, పెద్దవారు కేక్ కట్ చేశి, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను సన్మానించి కార్యక్రమాన్ని ముగించారు.








👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z