DailyDose

క్రిప్టో వాడి డార్క్ వెబ్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసిన ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-CrimeNews-Aug 10 2024

క్రిప్టో వాడి డార్క్ వెబ్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసిన ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-CrimeNews-Aug 10 2024

* ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గుంతల లోతు తెలియక ఇద్దరు విద్యార్థులు (Students ) మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లా (Prakasam district) లో చోటు చేసుకుంది. జిల్లాలోని పామూరు మండలం డివి పాలెం గ్రామానికి చెందిన పదవతరగతి విద్యార్థులు గౌతమ్‌, చరణ్‌ చదువుతున్న పాఠశాలకు రెండు రోజులు సెలవులు రావడతో ఇద్దరు సమీపంలోని వాగులో స్నానానికి వెళ్లారు. వాగులో ఇసుక రవాణా చేయడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు నిండిపోవడం, అక్కడ లోతు ఉండడాన్ని గమనించక స్నానానికి వాగులో దిగారు. ఈత రాని ఇద్దరు విద్యార్థులు గుంతలో పడి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

* జిల్లా ప‌రిధిలోని ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ జ‌రిగింది. గర్భ గుడి ముందున్న 2 హుండీల‌ను శుక్ర‌వారం రాత్రి దొంగ‌లు అప‌హ‌రించారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పూజారులు.. హుండీలు మాయ‌మైన దృశ్యాన్ని గ‌మ‌నించారు. దీంతో పూజారులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఏడుపాయ‌ల ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించ‌గా, పాత క‌ల్యాణ‌క‌ట్ట వ‌ద్ద హుండీలు క‌నిపించాయి. రెండు హుండీల‌ను ధ్వంసం చేసి న‌గ‌దు, విలువైన కానుక‌ల‌ను దొంగ‌లు అప‌హ‌రించిన ఆన‌వాళ్లు ఉన్నాయి. ప‌ది రోజుల క్రిత‌మే ఆల‌యంలోని హుండీల‌ను సిబ్బంది లెక్కించారు. ఈ చోరీ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పాప‌న్న‌పేట పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

* క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోని మెట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. గొడ‌వ ప‌డ్డ ఓ దంప‌తులిద్ద‌రూ మెట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చారు. పోలీసు స్టేష‌న్ ఎదుట‌నే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ మ‌రోసారి గొడ‌వ ప‌డ్డారు. దీంతో ఏఎస్ఐ ఆంజ‌నేయులు, ఓ హెడ్ కానిస్టేబుల్.. ఆ దంప‌తుల వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఇక వారిద్ద‌రిని విడిపించే క్ర‌మంలో ఇద్ద‌రు పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఏఎస్ఐ ఆంజ‌నేయులు.. మ‌హిళ‌పై లాఠీ ఝులిపించారు. లాఠీతో కొడుతూ.. ఆమెను భ‌య‌పెట్టిస్తూ పోలీసు స్టేష‌న్ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి త‌రిమేశాడు ఏఎస్ఐ. హెడ్ కానిస్టేబుల్ కూడా ఆమె ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌హిళ‌పై చేయి చేసుకున్న ఇద్ద‌రు పోలీసుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.

* డార్క్‌ వెబ్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను తెలంగాణ నార్కోటిక్‌ పోలీసులు పట్టుకున్నారు. వెబ్‌ ద్వారా మాదకద్రవ్యాలను ఆర్డర్‌ చేస్తున్నట్టు అనుమానం వచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. జులై 31న డార్క్‌ వెబ్‌ ద్వారా డ్రగ్స్‌ రాష్ట్రానికి వస్తున్నట్టు సమాచారంతో అతనిపై దృష్టి పెట్టారు. అస్సాం నుంచి స్పీడ్ పోస్టులో ఖమ్మం జిల్లాకు మత్తు పదార్ధాలు వస్తున్నాయని సమాచారం తెలుసుకున్నారు. ఈనెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో టీజీన్యాబ్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముత్తు పదార్ధాలను స్వాదీనం చేసుకున్నారు. న్యూస్ పేపర్లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించి డెలివరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కోనుగొలు చేసిన సమయంలో క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవాలు జరిపినట్లు టీజీన్యాబ్ పోలీసులు గుర్తించారు. పట్టుబడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

* గుంటూరు జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి మండలం కాజా టోల్‌ గేట్‌ వద్ద సెబ్‌ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విశాఖ నుంచి తమిళనాడుకి రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాల్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వీరి వద్ద నుంచి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు గత కొంతకాలంగా విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు సెబ్ అధికారులు తెలిపారు. శనివారం తమకు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్టు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z