ఖాతాదారులు డ్రా చేసిన నగదు కంటే అధికంగా కరెన్సీ నోట్లు రావడంతో కలకలం సృష్టించింది. దీంతో ప్రజలు ఆ ఏటీఎం వద్దకు భారీగా చేరుకున్నారు..వివరాలిలా ఉన్నాయి..రెండు రోజులు వరుస సెలవులు రావడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం నగదు పొందుపరిచారు. శనివారం ఉదయం ఓ ఖాతాదారుడు రూ.8 వేలు డ్రా చేయగా ఏటీఎం నుంచి రూ.9,500 వచ్చాయి. మరొకరికి రూ.5 వేలకు గాను రూ.7 వేలు రావడంతో విషయం కాస్తా పట్టణం అంతా పాకింది. దీంతో ఖాతాదారులు ఏటీఎం వద్ద బారులు తీరారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి బ్యాంకు అధికారులకు తెలపడంతో వాళ్లు ఏటీఎం వద్దకు చేరుకుని మిషన్ను పరిశీలించి సాంకేతిక సమస్య వల్ల అధికంగా నగదు వస్తున్నట్లు నిర్ధారించి, ఏటీఎంను మూసేశారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి నగదు డ్రా చేసిన ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z