Devotional

Horoscope in Telugu – Aug 12 2024

Horoscope in Telugu – Aug 12 2024

మేషం
మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

వృషభం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ శుభాన్నిస్తుంది.

మిథునం
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

కర్కాటకం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బందినిస్తాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.

సింహం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.

కన్య
తోటివారిసహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధించడం వలన బాగుంటుంది.

తుల
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. లక్ష్మీఅష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు
చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

మకరం
కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కుంభం
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహ సూచితం, తోటివారిని కలుపుకుపోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

మీనం
ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z