బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) స్వర్ణోత్సవ(50) వేడుకలను పురస్కరించుకుని ఆదివారం నాడు వాలీబాల్ , త్రోబాల్ పోటీలను నిర్వహించారు. వర్జీనియా వాలీబాల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ పోటీల్లో ప్రవాస క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులు, మహిళలు పోటాపోటీగా తలపడ్డారు. విజేతలను ఎంపిక చేసి ట్రోఫీని బహుకరించారు. వాలీబాల్ పోటీల విజేతలకు $3000 డాలర్లను అందించారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులు సురేంద్ర ఓంకారం, స్వరూప్ లింగ, అమర్ పశ్య, రాజేశ్ కాసరనేని తదితరులు ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు. GWTCS అధ్యక్షుడు కృష్ణ లాం, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నె, భాను మాగులూరి, శ్రీవిద్య సోమ, పద్మజ బెవర తదితరులు సమన్వయపరిచారు. తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చింత, సత్య సూరపనేనిలు పాల్గొన్నారు.
* పురుషుల వాలీబాల్ డివిజన్ 1 విజేతగా కంట్రీ ఓవెన్ యూత్, రన్నర్స్‌గా కంట్రీ ఓవెన్ లెగసీ.
* పురుషుల వాలీబాల్ డివిజన్ 2 విజేతగా చీతాస్, రన్నర్స్‌గా రఫ్‌ఆడిస్తాం.
* మహిళల వాలీబాల్ విజేతగా బ్లాక్ ఎన్ రోల్, రన్నర్స్‌గా నాన్ ప్రాఫిట్ వాలీబాల్ క్లబ్.
* మహిళల విజేతగా సన్ రైజెస్, రన్నర్స్‌గా ఛాలెంజర్స్.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z