Movies

కోర్టులో నటి గౌతమి భూకబ్జా కేసు వాదన

కోర్టులో నటి గౌతమి భూకబ్జా కేసు వాదన

భూకబ్జా కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని నటి గౌతమి తెలిపారు. కారైక్కుడికి చెందిన అళగప్పన్‌ రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి రూ.3 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి గౌతమి రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అరెస్టు అయిన అళగప్పన్, ఆయన భార్య నాచ్చియార్‌ తదితరులు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా గౌతమి తరఫున హాజరైన న్యాయవాది.. వారికి బెయిల్‌ ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z