* ‘ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఒక సినిమా కోసమైతే పదే పదే ఆడిషన్ చేశారు. ఎట్టకేలకు ఆ మూవీలో సెలక్ట్ అయ్యాను. రెండు, మూడు నెలల పాటు ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్ జరిగాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఆ తర్వాత దాదాపు పాతిక ఆడిషన్స్‌లో రిజెక్ట్ చేశారు. నా నటనపై వాళ్లకెప్పుడూ అనుమానం ఉండేది. ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదు. దీంతో నా ప్రతి సినిమాకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వచ్చా. నేనెప్పుడు నా సినిమాలు చూసినా, ఇంకాస్త బాగా చేస్తే బాగుండేదనుకుంటా’’ అని రష్మిక వెల్లడించింది.
* ‘బాలికా వధు’ అనే ధారావాహికతో తెలుగుతోపాటు విదేశాల్లోనూ ఫేమ్ సొంతం చేసుకున్నారు నటి అవికాగోర్ (Avikagor). ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తున్నారీ భామ. ఇటీవల ఆమె ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ విందులో పాల్గొన్నారు. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె హాజరయ్యారు. ఆగస్టు మొదటి వారంలో జరిగిన ఈ కార్యక్రమం గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
* ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌గా ఎదిగారు విజయ్ సేతుపతి. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రతి సినిమాలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన నటించిన సినిమాల్లో తెరపై పాత్రే కనిపిస్తుంది తప్ప, ఆయన కనిపించరు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే… మరోవైపు అగ్ర తారల సినిమాల్లో కీలక పాత్రల్లో ఒదిగిపోతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ రిపీట్ మోడ్‌లో చూసినట్లు చెప్పారు.
* దర్శకుడు కృష్ణవంశీ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించిన ‘మురారి’ (Murari) రీ రిలీజ్ నేపథ్యంలో కొన్నిరోజుల నుంచి అభిమానులతో ఎక్కువగా చాట్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ‘మురారి’ సీక్వెల్‌ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో సినిమా గురించీ మాట్లాడారు. ‘‘మహేశ్ బాబు తనయుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రెండేళ్ల తర్వాత ‘మురారి’ సీక్వెల్ తెరకెక్కించండి’’ అని నెటిజన్ అడగ్గా.. ‘‘ఆ విషయాన్ని మీరు లేదా నేను చెప్పకూడదు. మహేశ్, నమ్రత, గౌతమ్ నిర్ణయించాలి. కాబట్టి వాళ్లనే డిసైడ్ చేయనిద్దాం’’ అని బదులిచ్చారు.
* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మార్జిన్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించిన విషయాలపైనా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
* ‘తంగలాన్’ (Thangalaan)లో మాళవికా మోహనన్ (Malavika Mohanan) పోషించిన పాత్రలాంటిది ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ రాలేదని అన్నారు విక్రమ్ (Vikram). ఆయన హీరోగా దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడ, గుంటూరులోని పలు ప్రాంతాల్లో సందడి చేసింది. అనంతరం మీడియాతో సమావేశమైంది.
* ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రూ.3,01,116ను చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు.
* రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ‘‘వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయండి. టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించింది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి. రోగులకు శుభ్రమైన బెడ్‌షీట్లు అందించాలి. రాష్ట్రంలో ఎక్కడా డోలీ మోతలు కనిపించొద్దు. ఫీడర్ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలి. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని సూచించారు.
* దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఇందులో ‘ఐఐటీ మద్రాస్’ మరోసారి ది బెస్ట్ అనిపించుకుంది. అత్యుత్తమ విద్యాసంస్థ (ఓవరాల్)గా వరుసగా ఆరో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఇక, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ కింద రూపొందించిన ఈ జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నేడు విడుదల చేశారు. యూనివర్సిటీలు, కాలేజీలు, రీసర్చ్ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్.. ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించారు. విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తోంది.
* రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ‘‘వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయండి. టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించింది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి. రోగులకు శుభ్రమైన బెడ్‌షీట్లు అందించాలి. రాష్ట్రంలో ఎక్కడా డోలీ మోతలు కనిపించొద్దు. ఫీడర్ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలి. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z