NRI-NRT

పెనమలూరు: అత్యవసర వైద్య విధానాలపై తానా అవగాహన శిబిరం

పెనమలూరు: అత్యవసర వైద్య విధానాలపై తానా అవగాహన శిబిరం

అమెరికాలోని వర్జీనియాలో 10వ తరగతి చదువుతున్న అర్జున్‌ పరుచూరి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తోడ్పాటుతో గురువారం నాడు కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో సీపీఆర్, మానసిక ఆరొగ్య, పౌష్ఠికాహారం వంటి విషయాలపై అవగాహన కల్పించి విద్యార్థులకు శిక్షణనిచ్చాడు.

అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సిపిఆర్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించాడు. ఆరోగ్యంపై సరైన అవగాహనతో ఉండాలాని తద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చని తెలిపాడు. ఈ శిబిరంలో అర్జున్ తల్లి డా. నాగమల్లిక జాస్తి, కిలారు శివకుమార్‌, ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్గా భవాని, డిఈఓ పద్మరాణి, ఎంఈఓ కనకమహాలక్ష్మి, పెనమలూరు ఎన్నారై స్థానిక ప్రతినిధి సుధీర్ పాలడుగు తదితరులు పాల్గొన్నారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ ఎండూరి, తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్ ‌ మల్లినేని, డాక్టర్‌ ఓ.కె. మూర్తి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z