NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హాంగ్‌కాంగ్‌లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

“సురభి ఏక్ ఎహసాస్” కార్యక్రమం పేరిట శనివారం నాడు హాంగ్‌కాంగ్‌లోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్‌లో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన దేశ సైనికుల శౌర్యాన్ని కొనియాడారు. దేశభక్తి పాటలు – నృత్యాల ద్వారా మాతృభూమి పట్ల అభిమానాన్ని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమాన్ని RJ జయ సమన్వయపరిచారు. దేశభక్తి పాటలతో, నృత్యాలతో పిల్లలు పెద్దలు ప్రేక్షకులని అలరించారు. స్థానిక పిల్లలు భారత జాతీయ గేయం, జాతీయ గీతాన్ని ఆలపించారు. సీనియర్ సిటిజన్స్ గ్రూప్ “జాలి గుడ్ మైత్రివన్” సభ్యులు నయా దౌర్ చిత్రం లోని “యే దేశ్ హేయ్ వీర్ జవానో కా” పాట ఆలపించి ఉత్సాహపరిచారు. విశ్రాంత కార్గిల్ వీరుడు సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్, పివిసి; విశ్రాంత మేజర్ డిపి సింగ్; విశ్రాంత వింగ్ కమాన్దర్ అఫ్రాజ్, యువ రచయిత దీపక్ సురానాలు తమ వీడియో సందేశాలను పంపించారు. వ్యాఖ్యాతగా సౌరభ్ రాఠీ వ్యవహరించారు. హిందిలో కవిత రచనల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరు పాల్గొన్నారు….

హిమాంశు గుప్తా, కౌంసిల్, భారత కాన్సులేట్ జనరల్, హాంకాంగ్ మరియు మకావు.
గౌతమ్ బోర్డోలోయి, అధ్యక్షుడు, ఫోరమ్ ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్.
నోతన్ తొలాని, ఇండియా అసోసియేషన్ హాంకాంగ్ సభ్యుడు.
సోహన్ గోయెంక, అధ్యక్షుడు, చైనా మరియు హాంకాంగ్ కి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OF-BJP).
భారత్ దేశం కోసమని మూడు యుద్ధాలలో పోరాడిన్ కెప్టెన్ రామచందర్.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z