* రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ల (ట్రైన్ తిచ్కెత్) కొనుగోలు ఇకపై సులభతరం కానుంది. క్యూఆర్ కోడ్ (Qఋ చొదె) ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే (శౌథ్ చెంత్రల్ రైల్వయ్) వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు టికెట్ కొనుగోలులో చిల్లర కష్టాలు తీరనున్నాయి. తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉండగా.. ఇప్పుడు అన్ని స్టేషన్లకూ విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్ చేశాక.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ పూర్తవ్వగానే టికెట్‌ను అందిస్తారు.
* పారిస్ విశ్వక్రీడలు ముగిశాయి. భారత్ క్రీడాకారులు ఆరు పతకాలతో స్వదేశం చేరుకొన్నారు. మను, సరబ్‌జోత్, స్వప్నిల్, అమన్, నీరజ్ వ్యక్తిగత విభాగాల్లో, భారత హాకీ జట్టుకు గ్రూప్ విభాగంలో విజయాలు లభించాయి. ఈనేపథ్యంలో ఆటగాళ్లపై బహుమతుల వర్షం కురుస్తోంది. ప్రభుత్వం, పలు సంస్థలు కార్లు, ఇళ్లు, ఇతర కానుకలను ఇస్తున్నాయి. వీటిపైన ప్రభుత్వం పన్ను విధిస్తుందా..? సాధారణంగా ఫ్రాన్స్‌లో బంగారం పతకం గెలిచిన ఆటగాడికి రూ.80వేలు, రజతానికి రూ.40 వేలు, కాంస్యానికి రూ.20 వేలు (భారతీయ కరెన్సీ ప్రకారం) లభిస్తాయి. వీటిల్లోనే పన్ను మొత్తం కట్ చేస్తారు. కానీ, మన అథ్లెట్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని అంశాలు పన్ను పరిధిలోకి వస్తే.. మరికొన్ని రావు. 2014లో విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టతనిచ్చింది. ప్రభుత్వాల నుంచి ఒలింపిక్, కామన్‌వెల్త్, ఆసియా క్రీడల పతక విజేతలకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 10(17) కింద మినహాయింపు లభిస్తుందని చెప్పింది.
* ప్రభుత్వ ఖాతాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో కర్ణాటక ప్రభుత్వం లావాదేవీలను నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా బ్యాంకుల్లోని తమ తమ ఖాతాలు మూసివేయడంతో పాటు డిపాజిట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండూ ప్రభుత్వ రంగ బ్యాంకులే కావడం గమనార్హం. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగిన ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు వెంటనే తమ ఖాతాలను రద్దు చేసుకోవాలి. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు గానీ, డిపాజిట్లు గానీ చేయొద్దు’’ అని కర్ణాటక ఆర్థిక శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (శ్తొచ్క్ మర్కెత్) లాభాల్లో ముగిశాయి. అమెరికా ఎకనామిక్ డేటా పాజిటివ్‌గా రావడంతో ప్రపంచ మార్కెట్లలో కొంత సానుకూలత నెలకొంది. దేశీయంగా వెలువడిన రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలూ పాజిటివ్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అయిన టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌అండ్‌టీ షేర్లు రాణించగా.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెటల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 79,065.22 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. రోజంతా దాదాపు లాభాల్లోనే కొనసాగింది. చివరికి 149.85 పాయింట్ల లాభంతో 79,105.88 వద్ద ముగిసింది. నిఫ్టీ కేవలం 4 పాయింట్లు లాభపడి 24,143.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది. సెన్సెక్స్‌లో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.95 డాలర్లు ఉండగా.. బంగారం ధర మళ్లీ పుంజుకుని ఔన్సు 2,512 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z