NRI-NRT

ఐరాసలో అధికార భాషగా హిందీకి గుర్తింపు కావాలి. దౌత్యవేత్తతో యార్లగడ్డ భేటీ.

ఐరాసలో అధికార భాషగా హిందీకి గుర్తింపు కావాలి. దౌత్యవేత్తతో యార్లగడ్డ భేటీ.

రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ న్యూయార్క్‌లోని ఐరాసలో భారత శాశ్వత రాయబార కార్యాలయంలో దౌత్యాధికారి రవీంద్రన్‌ను కలిశారు. ఐరాసలో హిందీని అధికార భాషగా గుర్తించేందుకు చేయవలసిన ప్రయాత్నాలను గురించి చర్చించారు.

ప్రస్తుతం ఐరాసలో ఫ్రెంచి,ఇంగ్లీష్,చైనీస్,రష్యన్,అరబిక్,స్పానిష్ ఆరు భాషలు మాత్రమే అధికార భాషలుగా ఉన్నాయని, ఐరాసలో అటల్ బిహారి వాజపేయి,పి.వి.నరసింహారావు, నరేంద్రమోడిలు మాత్రమే హిందీలో ప్రసంగించారని యార్లగడ్డ గుర్తు చేశారు. ఈ సందర్భంగా దౌత్యాధికారి రవీంద్రన్ తాము ప్రభుత్వపరంగా చేస్తున్న ప్రయత్నాలను యార్లగడ్డకు వివరించారు. ఐరాసలోని 196 దేశాల్లో ఈ ప్రతిపాదనకు మూడో వంతు మద్దతు ఇస్తే ఇది సాధ్యపడుతుందని, ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయుల మద్దతును కూడా భారత ప్రభుత్వం కూడగట్టిందని రవీంద్రన్ వెల్లడించారు. భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదన విజయవంతం అయ్యేందుకు మిలియన్ డాలర్లు (₹8.3కోట్లు) మంజూరు చేసిందని తెలిపారు. ఈ భేటీకి ముందు రోజు యార్లగడ్డ ఐరాస ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడి భాషా విభాగంలోని అధికారులతో హిందీని అధికార భాషగా గుర్తించే విషయం గురించి వివరాలు తెలుసుకున్నారు.

*** డా. నోరితో భేటీ
తన అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కాన్సర్ వైద్య నిపుణులు డా.నోరి దత్తాత్రయుడుని యార్లగడ్డ మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశంతో పాటు 30 దేశాలకు వైద్య సేవలందిస్తూ, ఏడాదికి నాలుగు పర్యాయాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలకు తన సమయాన్ని వెచ్చిస్తున్న నోరిని యార్లగడ్డ అభినందించారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z