⚛ చాలామంది కిస్‌మిస్‌లు నేరుగా తినేస్తుంటారు. కానీ వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టుకొని తీసుకోవడం మరీ మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఉండే ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల స్థాయులు నానబెట్టడం వల్ల రెట్టింపవుతాయట! వీటిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అందడంతో పాటు.. జీర్ణశక్తీ పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ నానబెట్టిన కిస్‌మిస్‌లను నేరుగా తినచ్చు.. లేదంటే సెరల్స్, సలాడ్స్‌లో భాగం చేసుకోవచ్చు.
⚛ సబ్జా గింజల్ని నానబెట్టుకొనే తీసుకుంటుంటారు చాలామంది. దీనివల్ల వీటిలో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్రొటీన్.. వంటి పోషకాల స్థాయులు పెరుగుతాయట! ఇవి అరుగుదలను ప్రేరేపించడంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అలాగే కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గడంలోనూ సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
⚛ అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల మ్యుసిలేజ్ అనే జెల్ తరహా పదార్థం విడుదలవుతుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే లిగ్నాన్స్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్.. వంటి పోషకాల స్థాయులు పెరుగుతాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
⚛ బాదం పప్పుల్ని నేరుగా కంటే నానబెట్టుకొని తినడం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాల్ని పొందచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని నానబెట్టడం వల్ల ఫైటికామ్లం అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది శరీరానికి పోషకాల్ని గ్రహించే శక్తినిస్తుంది. కాబట్టి రోజూ గుప్పెడు నానబెట్టిన బాదంపప్పుల్ని పొట్టు తొలగించుకొని తీసుకోవడం, స్మూతీలు-స్నాక్స్‌లో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
⚛ మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే గుమ్మడి గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల.. ఇందులోని ఫైటికామ్లం విచ్ఛిత్తి చెందుతుంది. ఇది శరీరంలోకి చేరి ఆహారంలోని పోషకాల్ని సులభంగా గ్రహించే శక్తిని శరీరానికిస్తుంది. గుమ్మడి గింజల్ని నానబెట్టడం వల్ల వాటి రుచి కూడా పెరుగుతుందట!
⚛ వాల్‌నట్స్‌లో ఎంజైమ్ నిరోధకాలు, ఫైటికామ్లం.. వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని అరిగించుకునే శక్తి కొంతమందికి ఉండదు. కాబట్టి వీటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టడం వల్ల ఇవి విచ్ఛిత్తి చెందుతాయి. ఫలితంగా త్వరగా జీర్ణమై.. పోషకాల్ని గ్రహించే శక్తిని శరీరానికి అందిస్తాయి. అలాగే ఈ నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తోడ్పడతాయని ఓ అధ్యయనంలో తేలింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z