WorldWonders

CEO పాస్‌పోర్ట్ చోరీ చేసిన మాజీ ఉద్యోగి-CrimeNews-Aug 16 2024

CEO పాస్‌పోర్ట్ చోరీ చేసిన మాజీ ఉద్యోగి-CrimeNews-Aug 16 2024

* లేఆఫ్ ప్రకటించారన్న కోపంతో మాజీ ఉద్యోగి ఒకరు తన పాస్‌పోర్ట్‌ దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ సార్థి ఏఐ సీఈవో నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్‌ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్‌ లేఆఫ్‌లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది. సంస్థను లాభాల పట్టించేందుకే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని గతంలో విశ్వనాథ్ వెల్లడించారు. ఆ కఠిన నిర్ణయం వెనుక ఇన్వెస్టర్ల ఒత్తిడి ఉందని తెలిపారు. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కథనం ప్రకారం.. అమెరికా వీసాతో ఉన్న తన పాస్‌పోర్ట్‌ను ఉద్వాసనకు గురైన ఓ సీనియర్ ఉద్యోగి దొంగలించారని ఝా తెలిపారు. దీంతో స్టార్టప్‌నకు నిధులు పొందేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్‌ వచ్చినప్పటికీ.. కొత్త యూఎస్‌ వీసా కోసం చాలాకాలం వేచి ఉండటం వల్ల సంస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

* ప్రభుత్వ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఫైట్‌ జరిగింది. ఈ సందర్భంగా పదో తరగతి స్టూడెంట్‌ను మరో స్టూడెంట్‌ను కత్తితో పొడిచాడు. (Mob Sets Cars On Fire) గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు మతాలకు చెందిన విద్యార్థులు, జనం రెచ్చిపోయారు. రాళ్లు రువ్వడంతోపాటు పలు కార్లకు నిప్పుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ప్రభుత్వ స్కూల్‌లో లంచ్‌ బ్రేక్‌ సమయంలో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల హిందూ విద్యార్థి తొడపై ముస్లిం విద్యార్థి కత్తితో పొడిచాడు. గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ ఆసుపత్రికి వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఈ సంఘటన నేపథ్యంలో రెండు మతాలకు చెందిన విద్యార్థులు, జనం రెచ్చిపోయారు. ఉదయ్‌పూర్‌లో అల్లర్లకు పాల్పడ్డారు. పలు చోట్ల రాళ్లు రువ్వడంతోపాటు సుమారు ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్‌ చేశారు. అలాగే నగరంలో నిషేధిత ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కత్తితో పొడిచిన విద్యార్థితోపాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని ఉదయపూర్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

* మ‌హిళా డాక్ట‌ర్ల ప‌ట్ల వేధింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిలో దారుణం వెలుగు చూసింది. హౌజ్ స‌ర్జ‌న్ ప‌ట్ల ఓ వ్య‌క్తి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో 150 మంది హౌజ్ స‌ర్జ‌న్లు ఆందోళ‌న‌కు దిగారు. మ‌హిళా డాక్ట‌ర్ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకోవాల‌ని నిన్న సాయంత్రం నుంచి హౌజ్ స‌ర్జ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు సీరియ‌స్‌గా స్పందించారు. డాక్ట‌ర్ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పేర్కొన్నారు. మ‌హిళా డాక్ట‌ర్ల ర‌క్ష‌ణ‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీన్ ఆఫీసు ముందు డాక్ట‌ర్లు ఆందోళ‌న‌కు దిగారు.

* కొందరు వ్యక్తులు ఒక మహిళను బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. జన సంచారం లేని ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Woman Gang Raped) దీనిని వీడియో తీసి ఆమెను బెదిరించసాగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిందితులైన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆగస్ట్‌ 9న రాత్రి వేళ తాను నివసించే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఏకాంత ప్రదేశంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. వీడియో రికార్డ్‌ చేసి తనను బెదిరిస్తున్నారని చెప్పింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z