Devotional

Horoscope in Telugu – Aug 18 2024

Horoscope in Telugu – Aug 18 2024

మేషం
కీలక వ్యవహారాల విషయమై పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

వృషభం
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం
ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. అష్టమ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.

కర్కాటకం
ఆశించిన ఫలితాలు వస్తాయి. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలు వస్తాయి.

సింహం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి, శ్రీరామరక్షా స్తోత్రం చదివితే మంచిది.

కన్య
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవారాధన శుభకరం.

వృశ్చికం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనుస్సు
శ్రమతో కూడిన ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

మకరం
ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు సదా రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శ్రీఆంజనేయస్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభం
ఆలోచనల్లో నిలకడ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

మీనం
పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి, ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z