బీటా తలసేమియా(Beta thalassemia) వ్యాధిపై అవగాహన కల్పించే నిమిత్తం సాకేత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఫ్రిస్కోలో 5కె వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ 5కె వాక్ ద్వారా సేకరించిన నిధులను బీటా తలసేమియా వ్యాధి పరిశోధన, పేద రోగులకు చికిత్స, చిన్నారులకు విద్యా-వైద్య సదుపాయల కల్పన వంటి కార్యక్రమాలకు వినియోగిస్తామని సాకేత్ ఫౌండేషన్ నిర్వాహకులు కొల్లా శ్రీనివాస్-లక్ష్మీ దంపతులు తెలిపారు. 2012లో తమ కుమారుడిని ఈ వ్యాధి బలిగొందని, తమకు వచ్చిన కష్టం ఇతరులకు కలగకూడదనే సద్దుదేశంతో ప్రతి ఏటా ఈ 5కె వాక్ కార్యక్రమం నిర్వహించి నిధులను సేకరించి సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అవసరమైన మేర తోడ్పాటు అందిస్తున్నట్లు వెల్లడించారు. సాకేత్ గౌరవార్థం లిటిల్ ఎల్మ్, ప్రాస్పర్ నగర మేయర్లు ఆగష్టు 12ను కొల్లా సాకేత్ డేగా ప్రకటించారు. శనివారం నాడు ఫ్రిస్కోలో జరిగిన కార్యక్రమంలో కొల్లా అశోక్‌బాబు, కొల్లా సుబ్బారావు, వేమూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాలకు – https://sakethfoundation.wordpress.com/ చూడవచ్చు.
Pizza Twist McKinney Helped The Event By Being The Food Sponsor. https://order.online/store/pizza-twist-mckinney-2723587/?hideModal=true&pickup=true/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z