Movies

చెన్నై ఆసుపత్రిలో చేరిన గాయని సుశీల

చెన్నై ఆసుపత్రిలో చేరిన గాయని సుశీల

ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్‌ గ్రహీత పి.సుశీల (P.Susheela) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 86 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని సన్నిహితులు, అభిమానులు పేర్కొంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z