Health

అమెరికాను వణికిస్తున్న KP2 కరోనా

అమెరికాను వణికిస్తున్న KP2 కరోనా

కొవిడ్‌ కొత్త వేరియెంట్‌ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తున్నది. దవాఖానల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది. 2022 జూలై తర్వాత, మురుగునీటిలో వైరల్‌ యాక్టివిటీ (ఆగస్టు 10న 8.82) అత్యధిక స్థాయికి చేరుకుంది. వేసవి సీజన్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి. ‘శాంపిల్స్‌లో 100% ‘సార్స్‌-కోవ్‌-2’ను గుర్తించాం’ అని వేస్ట్‌వాటర్‌ స్కాన్‌’ ప్రోగామ్‌ డైరెక్టర్‌ మార్లినె అన్నారు. స్కూళ్ల సెలవులు ముగిసాక, కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌డీఏ అనుమతులు వస్తే, కేపీ.2 వేరియెంట్‌కు కొత్త వ్యాక్సిన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులో వస్తుందని తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z