ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుచ్చిబాబు(40) అమెరికాలో మృతి చెందారు. ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లారు. ప్రమాదవశాత్తూ బీచ్‌లో నీటమునిగి మృతి చెందాడు. కుమారుడు చనిపోయిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుచ్చిబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z