Devotional

Horoscope in Telugu – Aug 20 2024

Horoscope in Telugu – Aug 20 2024

మేషం
ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

వృషభం
కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.

మిథునం
మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు విచక్షణాజ్ఞానంతో ముందుకు సాగండి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం
మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

సింహం
స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినప్పటికీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

కన్య
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. బుద్ధిబలంతో ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం..

తుల
కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్ధిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీరామ సందర్శనం మరింత మేలు చేస్తుంది.

వృశ్చికం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు
అనుకూలమైన సమయం. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మకరం
ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనఃశ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర సందర్శనంతో ప్రశాంతతతో పాటు శుభప్రదం.

కుంభం
మిశ్రమకాలం. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. చంద్ర ధ్యానశ్లోకం చదివితే మంచిది.

మీనం
దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. శ్రీమహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z