NRI-NRT

సింగపూర్‌లో జంధ్యాల పౌర్ణమి పూజ

సింగపూర్‌లో జంధ్యాల పౌర్ణమి పూజ

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) సింగపూర్ విభాగం అధ్వర్యంలో ఆర్యవైశ్యులు శ్రావణపౌర్ణమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీతధారణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నల్ల భాస్కర్ గుప్త, కంకిపాటి శశిధర్, ఉద్దగిరి సతీష్, వెంకట రమణ నంగునూరి, సంకా వెంకట రవికుమార్ ల సమన్వయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పురోహితులు శ్రావణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు.

జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమం కలశ స్థాపనతో మొదలై, గణపతి పూజ, గాయత్రి మంత్ర పఠనం, వేదమంత్ర ఆశీర్వచనంతో ముగిసినది. వామ్ సింగపూర్ కమిటి సభ్యులు కంచర్ల శరత్ బాబు, కోట సతీష్, కొణిజేటి రవి కుమార్, ఓరుగంటి భాను ప్రసాద్, ఆలపాటి వెంకట రాఘవరావు, కాల్వ లక్ష్మణరాజు, కోట సుబ్బారావు, గాదంశెట్టి ఫణికృష్ణలు కార్యక్రమం నిర్వహణను ప్రర్యవేక్షించారు. WAM సింగపూర్ విభాగం అధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z