Devotional

Horoscope in Telugu – Aug 21 2024

Horoscope in Telugu – Aug 21 2024

మేషం
చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది.

వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మిథునం
శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.

కర్కాటకం
మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.

సింహం
చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనిలో బందుమిత్రులను కలుపుకొని పోవడం మేలు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కన్య
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవాలి.

తుల
ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్ర నామాలు పారాయణ చేయడం మంచిది.

వృశ్చికం
మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది .

ధనుస్సు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం.

మకరం
లక్ష్య సాధనలో అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

కుంభం
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిథి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధనా శుభప్రదం.

మీనం
మీమీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z