భారతీయ విశిష్ట పండుగ దీపావళి పండుగను అధికారికంగా గుర్తించడంతోపాటు, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి వారంగా గుర్తిస్తున్నట్లు నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ జిమ్ పిల్లెన్ కార్యాలయం ప్రకటించింది. అక్టోబర్ నెలను నెబ్రాస్కా రాష్ట్రంలో హిందూ హెరిటేజ్ మాసంగా కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నెబ్రాస్కా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ లింకన్‌లో వార్నర్ లెజిస్లేటివ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. మల్లికా జయంతి, కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, వెంకట్ జయంతి, రాజా కోమటిరెడ్డి, టాటారావు కోసూరి, అనిల్ పోతినేని, తపన్ దాస్, శైలేందర్, అరుణ్ కుమార్ పాండిచ్చేరి, దేవిక పాండిచ్చేరి, మాధవి, పీయూష్ శ్రీవాస్తవ్, ప్రవీణ్ గుమ్మడవల్లి, శ్రీపత్ కాంబ్లే, రామకృష్ణ కిలారు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z