Devotional

Horoscope in Telugu – Aug 22 2024

Horoscope in Telugu – Aug 22 2024

మేషం
లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. ద్వాదశంలో చంద్ర స్థితి అనుకూలంగా లేదు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. దుర్గారాధన శుభప్రదం.

వృషభం
శుభ ఫలితాలు ఉన్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం.

మిథునం
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచిపేరు దక్కుతుంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కర్కాటకం
ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

సింహం
ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

కన్య
దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

తుల
శుభ ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.

వృశ్చికం
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణుసహస్ర నామాలు పారాయణ చేయడం మంచిది.

ధనుస్సు
మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

మకరం
మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.

కుంభం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.

మీనం
ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారం,విషయంలోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. దుర్గాస్తోత్రం చదవాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z