Devotional

Horoscope in Telugu – Aug 23 2024

Horoscope in Telugu – Aug 23 2024

మేషం
అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.

వృషభం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

మిథునం
కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కలహ సూచన ఉంది. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటకం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

సింహం
కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.

కన్య
కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అష్టలక్ష్మీ స్తుతి మంచిది.

తుల
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

వృశ్చికం
కీలకమైన పనులను ప్రారంభించే ముందు సాధక బాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

ధనుస్సు
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.

కుంభం
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

మీనం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం.శ్రీలక్ష్మీధ్యానం శ్రేయస్కరం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z