NRI-NRT

షార్లెట్‌లో 300మంది పేద విద్యార్థులకు తానా తోడ్పాటు

షార్లెట్‌లో 300మంది పేద విద్యార్థులకు తానా తోడ్పాటు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి ఏటా బ్యాక్‌ప్యాక్‌ పేరిట పేద విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని షార్లెట్ తానా ప్రతినిధులు క్లియర్‌ క్రీక్‌ ఎలిమెంటరీ, బ్రన్స్‌ ఎవెన్యూ ఎలిమెంటరీ స్కూల్‌లో నిర్వహించి 300మంది పేద పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు.

తానా క్రీడల సమన్వయకర్త నాగ పంచుమర్తి, తానా అంతర్జాతీయ సమన్వయకర్త ఠాగూర్‌ మల్లినేని, తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి, పట్టాభి కంఠమనేని, రమణ అన్నే, సతీష్ నాగభైరవ, పార్ధ సారధి గునిచెట్టి తదితరులు పాల్గొన్నారు. తానాకు పాఠశాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z