Editorials

ఆగని అత్యాచారాలు-CrimeNews-Aug 23 2024

ఆగని అత్యాచారాలు-CrimeNews-Aug 23 2024

* దేశంలో వరుస అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని నర్సరీ చిన్నారులపై స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడడంతో తల్లిదండ్రులు, స్థానికులు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. వీటిని మరువకముందే అస్సాంలో మరో బాలికపై మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం, నాగావ్ జిల్లాకు చెందిన ఓ బాలిక(14) ట్యూషన్‌ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. చెరువు వద్ద వివస్త్రగా పడున్న బాలికను స్థానికులు గమనించి రక్షించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

* యూపీలో ఘోరం వెలుగుచూసింది. మేనకోడలుతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడటంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.ఈ ఘటన హర్దోయ్‌ జిల్లాలోచోటుచేసుకుంది.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా మహిళా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తాలోని సెల్డా క్రిమినల్‌ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితునికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.

* సరదా కోసం సెల్ఫీ (Selfie,) ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇస్తున్న యువత ఆ క్షణంలో పొంచి ఉన్న ముప్పును గమనించక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సెల్ఫీలు తీపిగుర్తులుగా బదులు మరచిపోని ఘటనలకు దారితీస్తున్నాయి. విజయవాడ(Vijayawada) రూరల్‌ మండలం పాతపాడులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. వీరంతా నాటుపడవ(Boat) ఎక్కి సెల్ఫీలు దిగుతుండగా నాటుపడవ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోగా మరో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో శివానంద్‌(23), రవికుమార్‌(21) మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* హైదరాబాద్‌లో (Hyderabad) మరో హత్య చోటుచేసుకున్నది. ప్రమ విషయంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్ ‌(Balapur) పరిధిలో జరిగింది. ఖమ్మం జల్లాకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్‌ ఏకైక కుమారుడు. తల్లితో కలిసి బాలాపూర్‌లో నివాసం ఉంటూ ఎంవీఎస్ఆర్‌ కాలేజీ‌లో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలాపూర్‌ గణేశ్‌ చౌక్‌ వద్ద మండి 37 అరేబియన్‌ హోటల్‌ వద్ద ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు యువకులు సిగరెట్లు తాగుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z