NRI-NRT

ఫ్లోరిడాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఫ్లోరిడాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఫ్లోరిడా రాష్ట్రం టంపాబేలో నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాట్స్ సంస్థ ప్రతినిధులు పలగొన్నారు. మాట, నాట్స్ టంపాబే విభాగం, మేలోడి మాక్ టైల్‌తో పాటు వివిధ స్థానిక భారతీయ సంస్థలు ఈ వేడుకలను నిర్వహించాయి. జెండా వందనం అనంతరం దేశభక్తి స్ఫురించే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రవాస భారతీయులకు రమేశ్ బాబు సేవలను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రశంసించారు. అనంతర మాట టాంపాబే విభాగాధ్యక్షుడు టోని జానుతో కలిసి రమేశ్ బాబును సత్కరించారు. స్థానికంగా ప్రవాస భారతీయుల సంక్షేమానికి కృషి చేసిన వారిని ఈ వేడుకల్లో భాగంగా సత్కరించారు. ఈ వేడుకల్లో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు బహుమతులు అందించారు.

నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి రాజేష్ కాండ్రు, ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ సుమంత్ రామినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భరత్ ముద్దన, మాధవి యార్లగడ్డ, మాలినీ రెడ్డి, సతీష్ పాలకుర్తి, సుధాకర్ మున్నంగి, ప్రసాద్ నేరెళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z