NRI-NRT

మిస్సోరిలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

మిస్సోరిలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అమెరికాలోని మెగాస్టార్ అభిమానులు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలోని సినీమార్క్ థియేటర్ వద్ద అభిమానులు కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. చిరంజీవి ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని జనరంజక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రావికంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం “ఇంద్ర” చిత్రాన్ని వీక్షించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z