NRI-NRT

ఎస్వీ అన్నదాన ట్రస్టుకు కోటి రూపాయిలు విరాళమిచ్చిన టంపాబే ప్రవాసాంధ్రుడు

ఎస్వీ అన్నదాన ట్రస్టుకు కోటి రూపాయిలు విరాళమిచ్చిన టంపాబే ప్రవాసాంధ్రుడు

ఫ్లోరిడాలోని టాంపాబేకు చెందిన కోట ప్రసన్న (కాకినాడ – శ్రీ ప్రసన్న కోట విరూపా పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ) బుధవారం రాత్రి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,00,01,116/- విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమ‌లలోఅదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. విరాళం చెక్కును అందజేసే కార్యక్రమంలో గుత్తికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z