Devotional

Horoscope in Telugu – Aug 26 2024

Horoscope in Telugu – Aug 26 2024

మేషం
ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.

వృషభం
అనుకున్నది సాధిస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

మిథునం
మిశ్రమకాలం. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవిష్ణువుని ఆరాధించాలి.

కర్కాటకం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

సింహం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కన్య
బంధు,మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.

తుల
ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. అధికారులు మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం
మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు
ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.

మకరం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

కుంభం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మీనం
ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z