NRI-NRT

డల్లాస్‌లో సిలికానాంధ్ర అన్నమయ్య సంకీర్తనోత్సవ సన్నాహక సమావేశం

SiliconAndhra Annamayya Samkeertanotsavam 2024 in Allen

సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలో మొదటిసారిగా డల్లాస్‌లో అన్నమయ్య సంకీర్తనోత్సవం పేరిట మహా బృంద గళార్చన కార్యక్రమాన్ని ఈ శనివారం (31వ తేదీ) అలెన్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక సన్నాహక సమావేశాన్ని ఇర్వింగ్‌లో ఆదివారం సాయంత్రం సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ సారథ్యంలో నిర్వహించారు. భద్రత, రిజిస్ట్రేషన్, వేడుక నియమ నిబంధనలు, కార్యక్రమ పట్టిక, విరాళాల సేకరణ వంటివాటిపై కమిటీలతో పూర్తిస్థాయిలో చర్చించి అమలకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

తాళ్లపాక అన్నమాచార్యుల వంశంలో 8వ తరానికి చెందిన తాళ్లపాక హరికృష్ణమాచార్యులు తరాలుగా తమ వంశంలో పూజలందుకుంటున్న అన్నమయ్య చెక్క శిల్పాన్ని సప్తసముద్రాల ఆవల ఉత్తర అమెరికాలో జరుగుతున్న సంకీర్తనోత్సవాన్ని వీక్షించేందుకు సిలికానాంధ్ర సంస్థకు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ఆనంద్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి భక్తుడికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు.

$5000 ఇచ్చినవారిని మహారాజపోషకులుగా, $2500 ఇచ్చిన వారిని రాజపోషకులుగా, $1116 ఇచ్చిన వారిని పోషకులుగా వేడుక వద్ద గుర్తించి తితిదే స్వామివారి వస్త్రంతో సత్కరిస్తామని ఆయన తెలిపారు. Zelle ద్వారా donate@siliconandhra.orgకు విరాళాలు అందజేయ్వచ్చునని వెల్లడించారు. 600ఏళ్ల కీర్తనలను ఆలపించి అన్నమయ్యకు, స్వామివారికి అర్చన చేసేందుకు ప్రవాసులు విరివిగా తరలిరావాలని ఆనంద్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే సంగీత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో ప్రసాద్ జోస్యుల, శాంతి కూచిభొట్ల, నూతి బాపు, మాదాల రాజేంద్ర, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు – https://annamayya.siliconandhra.org/

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z