NRI-NRT

ఆస్టిన్‌లో వీనులవిందుగా తానా సాంస్కృతికోత్సవం

ఆస్టిన్‌లో వీనులవిందుగా తానా సాంస్కృతికోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో 2024 సాంస్కృతిక మహోత్సవాన్ని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. తానా సౌత్ వేస్ట్ ప్రాంత సమన్వయకర్త పుసులూరి సుమంత్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాస యువతీ యువకులు, చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమలోని కళానైపుణ్యాలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు శ్రీధర్ పోలవరపు, ప్రసాద్ కాకుమాను, బాలాజీ పర్వతనేని, లెనిన్ ఎర్రం, సతీష్ గన్నమనేని, సూర్య ముళ్ళపూడి, విగ్నేష్, స్థానిక తానా వాలంటీర్స్ తోడ్పడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z