NRI-NRT

విజయవంతంగా తానా క్రికెట్ పోటీలు

విజయవంతంగా తానా క్రికెట్ పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రికెట్‌ పోటీలను శనివారం నాడు ఉత్తర కరోలినాలోని కన్‌కోర్డ్‌లో నిర్వహించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలను 9-11, 12-14 వయోవిభాగం ఆధారంగా విభజించారు.

12-15 విభాగంలో New Indians జట్టు విజేతగా నిలిచింది. ECA Wolves ద్వితీయ స్థానంలో నిలిచింది. 9-11 విభాగంలో All Stars జట్టు విజేతగా నిలిచింది. ECA Hawks ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రథమ బహుమతి $200, ద్వితీయ బహుమతి $150లను అందజేశారు.

తానా క్రీడా నిర్వాహక విభాగ సమన్వయకర్త నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు తానా అంతర్జాతీయ సమన్వయకర్త ఠాగూర్ మలినేని, టీమ్‌ స్క్వేర్‌ చైర్‌ కిరణ్‌ కొత్తపల్లి, పట్టాభి కంఠమనేని, అన్నే రమణ, వలంటీర్లు వెంకీ అడుసుమిల్లి, చందు బచ్చు, గోపి పాములపాటి, రఘు వీరమాచనేని, శ్రీధర్‌ నాగు బోయిన, సతీష్‌ నాగభైరవ, సాయి కిలారు, వెంకట కృష్ణ తదితరులు సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z