NRI-NRT

GWTCS స్వర్ణోత్సవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసులు

GWTCS స్వర్ణోత్సవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసులు

వాషింగ్టన్‌ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్‌ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాలకు ప్రవాసుల నుండి స్పందన బాగుందని అధ్యక్షుడు లాం కృష్న తెలిపారు. అందాల పోటీలకు, ఆట, పాట, గోల్డెన్‌ వాయిస్‌, డాన్సింగ్‌ సూపర్‌ స్టార్‌ పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ప్రవాసుల స్పందన పట్ల కృష్ణ హర్షం వెలిబుచ్చారు. పోటీదారులను అభినందించారు. సెప్టెంబర్‌ 27,28 తేదీల్లో జరిగే జిడబ్ల్యూటిసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ పోటీలను సమన్వయపరిచిన కల్చరల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుష్మ అమృతలూరి, సెక్రటరీ (కల్చరల్‌) శ్రీ విద్యా సోమ, గణేష్‌ ముక్క, నంద చెల్లువేది, అమర్‌ అతికం, శ్రావణి వింజమూరి, నివేదిత చంద్రుపట్ల, శిరీష, పావని పూదోట, జడ్జీలుగా వ్యవహరించిన తరుణ్‌ దోనిపాటి, భార్గవ్‌ హల్కూర్‌ చంద్రశేఖర్‌, షకీరా బేగం, సాయి సుధ పాలడుగు, మీనాల్‌ మణికందన్‌, అనుపమ సత్యవోలు, ఇంద్రాణి దావులూరి, కుసుమరావు, సాయికాంత లక్ష్మీరాపర్ల, ప్రత్యూష కుర్ర, నవ్య ఆలపాటి, సంస్థ ప్రతినిధులు సుశాంత్‌ మన్నె, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శ్రీనివాస్‌ గంగ, పద్మజ బెవరా, చంద్రమాలావతు తదితరులకు కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z