* ఆఫ్రికా దేశమైన నమీబియాలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు తాండవిస్తోంది. దీంతో ప్రజలు కనీసం కడుపు నిండా ఆహారం తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో తాజాగా 700 అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసం ప్రజలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు వంటివి కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన పర్యావరణ, అటవీ, పర్యటక మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. వీరు చెబుతున్న జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు (హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 జీబ్రాలు ఉన్నాయి. వీటి సంఖ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నాయి. నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. నైరుతి ఆఫ్రికాలో కరవు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడటమే ఈ నిర్ణయం లక్ష్యమని వెల్లడించాయి. ఈ ఏడాది కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో నమీబియాలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించారు. దాదాపు 14,00,000 మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య మొత్తం దేశ జనాభాలో సగానికి సమానం. ఈ భారీ ప్రాణుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాణులు జనావాసాలపై పడటం ఎక్కువైందని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో 83 ఏనుగులను గుర్తించామని పేర్కొంది. వీటి మాంసాన్ని కరవు సహాయక కార్యక్రమాల్లో భాగంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది.
* వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనలో ఆర్‌జీ కర్ ఆసుపత్రి సిబ్బంది స్పందించిన తీరు ఆదినుంచి అనుమానాస్పదంగానే ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థిని హత్యకు గురైన తర్వాత ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పేందుకు ఫోన్ చేసిన ఆసుపత్రి సిబ్బంది.. వాస్తవాలను దాచేందుకు యత్నించినట్లు కనిపిస్తోంది. తమ కుమార్తెకు ఏమైందని అడిగిన ప్రశ్నకు.. జ్వరం వచ్చిందని ఓసారి, ఆత్మహత్య చేసుకుందని మరోసారి.. ఇలా రకరకాల సమాధానాలు చెబుతూ వెంటనే ఆసుపత్రికి రావాలని చెప్పారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ పేద తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి తమ ముద్దుల కూతురు ఆసుపత్రిలో విగతజీవిగా ఉండడం చూసి గుండెలు బాదుకున్నారు. ఆగస్టు 9న తమ కుమార్తె గురించి ఆసుపత్రి సిబ్బంది చెప్పిన విషయాలను వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయస్థానానికి వెల్లడించారు. సుమారు తెల్లవారుజామున 3 నుంచి 4గంటల సమయంలో విద్యార్థిని చనిపోయినట్లు భావిస్తుండగా.. ఉదయం 10.53కు తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేసినట్లు వెల్లడైంది. ఆ సమయంలో ఫోన్ చేసిన వారు ఆందోళనకరంగా, భయపడుతున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన మూడు ఆడియో క్లిప్పులు కూడా ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
* ముంబయి సినీనటి కాదంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జత్వాని వేధింపుల కేసు విచారణ అధికారిణిగా ఎన్టీఆర్ కమిషనరేట్‌లో ఏసీపీగా ఉన్న స్రవంతీ రాయ్‌ని నియమిస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో జత్వానీతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలు ముంబయి వెళ్లే అవకాశాలున్నాయి.
* పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై వినయ్, గ్రామస్థుల కథనం ప్రకారం.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ వారు.. వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. గాయపడిన సత్యనారాయణ, సాయిబాబా సహా ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
* ఉమ్మడి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయం సమీపంలో.. నాటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని చిట్టపులివలసకు చెందిన నవవరుడు యామక గౌరీశంకరరావు 2018 మే 7న హత్యకు గురైన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో విచారణ అనంతరం ప్రధాన ముద్దాయి అయిన భార్య సరస్వతితో పాటు ప్రియుడు శివ, మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1100 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హతుడు గౌరీశంకరరావు తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహాచలమమ్మలు తమ కుమారుడి ఆత్మకు ఇన్నాళ్లకు శాంతి కలిగిందని భావోద్వేగానికి గురవుతూ స్వగ్రామం చిట్టపులివలసలో కుమారుడి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. ఏదిఏమైనప్పటికీ మా ఇంటి పెద్దదిక్కును కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
* నర్సింగ్ విద్యార్థిని ఫొటోలను మైనల్ బాలుడు మార్ఫింగ్ చేశాడు. తన స్నేహితుడితో కలిసి ఆమెను బెదిరించాడు. వారిద్దరూ కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. (Boys Rape Girl) బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల యువతి నర్సు కోర్సు చదువుతున్నది. ఆమె అద్దెకు ఉండే ఇంటి యజమాని మైనర్ కుమారుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ ద్వారా ఆ యువతి ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. తన ఫ్రెండ్‌తో కలిసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, బాధిత యువతి ఆ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం వారి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z