మేషం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం
అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు అందుకుంటారు. ధన, వస్త్ర లాభాలు ఉంటాయి. సూర్య నమస్కారం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
మిథునం
బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
కర్కాటకం
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.
సింహం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. శాంతంగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
కన్య
కార్యసిద్ధి ఉంది. మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. గురు ధ్యానం శుభప్రదం.
తుల
మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం కారణంగా ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే శుభఫలితాలు అందుకుంటారు.
వృశ్చికం
మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధు ప్రీతి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. లక్ష్మీఅష్టోత్తర శతనామావళిని పఠిస్తే మేలు చేస్తుంది.
మకరం
మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కుంభం
పట్టుదలే ఆయుధంగా ముందుకుసాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మీనం
కష్టపడి పనిచేస్తే తప్పకుండా పనులు పూర్తవుతాయి. కీలకమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. తోటివారి సలహాలు తప్పనిసరి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సమయం వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z