* సాధారణంగా ఏదైనా వస్తువును ఆన్లైన్ వేదికల్లో కొనుగోలు చేస్తే (Online Orders) ఒకట్రెండు రోజుల్లో డెలివరీ చేస్తారు. ఒక్కోసారి ఆర్డర్ చేసిన వస్తువుతో సంబంధం లేకుండా వేరే ప్రాడెక్ట్ డెలివరీ ఇవ్వడం, పాడైపోయిన ఉత్పత్తులు వంటివి ఆర్డర్లో వస్తుంటాయి. కానీ, తాజాగా ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఒక ఈ కామర్స్ సంస్థ వేదికగా రెండేళ్ల క్రితం క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌ను తాజాగా కంపెనీ డెలివరీ చేసింది. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ఆ కస్టమర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. జయ్ అనే ఓ యూజర్ ఈ- కామర్స్ వెబ్సైట్లో 2022 అక్టోబర్1 న కుక్కర్‌ను ఆర్డర్ చేశారు. అయితే ఎందుకో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు. దీంతో రీఫండ్ కూడా కస్టమర్ ఖాతాలో జమైంది. అయితే తాజాగా ఆ సంస్థ ఆ ఆర్డర్‌ను డెలివరీ చేసింది. అది చూసిన యూజర్ షాక్ తిన్నాడు.రెండేళ్ల క్రితం క్యాన్సిల్ చేసిన ఆర్డర్ తిరిగి డెలివరీ చేయడం ఏంటి.. అని గందరగోళానికి గురయ్యాడు. ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయాన్ని ‘‘ఎక్స్’’ వేదికగా పోస్ట్ చేశాడు. సంబంధిత స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాడు.
* జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్ స్టోరేజీని (Jio Cloud Storage) వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విభాగంలో కీలకంగా ఉన్న గూగుల్, యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిందని విశ్లేషకులు పేర్కొన్నారు. జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో గూగుల్ (Google One), యాపిల్ (iCloud) తమ సేవల ధరలు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు స్టోరేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లలో అధిక మంది గూగుల్ ఉచితంగా అందిస్తున్న 15జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు. దీంతో వారు అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం గూగుల్ వన్ 100జీబీ స్టోరేజీ ధర నెలకు రూ.130 ఉండగా.. ఐ క్లౌడ్ 50జీబీ స్టోరేజీ ధర రూ.75గా ఛార్జ్ వసూలు చేస్తోంది.
* ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిబ్బంది వార్షిక పనితీరు సమీక్ష ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం ఉద్యోగుల్లో 3 నుంచి 4శాతం మందిపై ఈ ప్రభావం పడనుంది. రానున్న కొన్ని వారాల్లో ఈ తొలగింపులను చేపట్టనుందని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై లేఆఫ్‌ల ప్రభావం పడనుంది. ఏకంగా 1300 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. ముఖ్యంగా నాసిరకం ప్రదర్శన చేసిన ఉద్యోగులపై తొలుత వేటు పడనుంది. గోల్డ్‌మన్ శాక్స్‌లో తొలగింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఓవైపు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై సంస్థ ఏ ప్రకటనా జారీ చేయలేదు. మహమ్మారి సమయంలో గోల్డ్‌మన్ శాక్స్ నాసిరకం పనితీరును కారణంగా చూపి పెద్దఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా రెండేళ్ల తర్వాత మరోసారి ఇదే కారణంతో లేఆఫ్‌లను ప్రకటించినట్లు తెలుస్తోంది.
* జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు సహజమే. ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి, ఒక్కోసారి సంపాదించిన మొత్తం కోల్పోవాల్సి రావచ్చు. అలాంటి సమయంలోనూ వెనకడుగు వేయకుండా గమ్యాన్ని చేరుకోవాలి. ఇలాంటి సంఘటనలే తన జీవితంలోను ఎదుర్కొన్నట్లు తెలిపారు షాదీ.కామ్ (Shaadi.com) వ్యవస్థాపకుడు, సీఈఓ అనుపమ్ మిట్టల్ (Anupam Mittal). అద్భుతమైన విజయాలు, అదే సమయంలో తీవ్ర నష్టాల్లోకి జారడం మళ్లీ తిరిగి విజయం సాధించడం.. ఇలా తన ప్రయాణం గురించి లింక్డిన్ వేదికగా పంచుకున్నారు. ‘‘ అనతికాలంలోనే అద్భుత విజయాలు సాధించా. 20 ఏళ్లలోనే కోటీశ్వరుడినయ్యా. మైక్రోస్ట్రాటజీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలో కంపెనీ 40 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. దీంతో డబ్బులు బాగా సంపాదించా. అమెరికాలో జీవితం చాలా అందంగా కనిపించింది. ఫెరారీని కూడా ఆర్డర్ చేశా. కొంత కాలానికి మొత్తం మారిపోయింది. డాట్-కామ్ బబుల్ సమయంలో అన్నింటినీ కోల్పోయా. ఉన్న డబ్బంతా పోయింది. నిజం చెప్పాలంటే అప్పుల్లో కూరుకుపోయా. 2003 నాటికి కేవలం గెలుపు, ఓటముల జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. అక్కడితో నా కథ ముగిసిపోలేదు.
* నిఫ్టీ 25,000 పైన ఉన్నంత కాలం మార్కెట్ బలంగా ఉండే అవకాశం ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ నిపుణులు రూపక్ దే తెలిపారు. ఈ స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెద్ద దిద్దుబాటుకు దారితీయవచ్చన్నారు. అంతేకాదు సమీప భవిష్యత్తులో నిఫ్టీ 25,500 స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.
* ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసిన తర్వాత వాపసు జాప్యం అనేది ప్రస్తుతం చాలా మంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య. అలాంటి వారికి వాపసు డబ్బు ఎప్పుడు వస్తుంది, రీఫండ్ ఆలస్యం అయితే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) ద్వారా లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC) దగ్గర సంతకం చేసిన ITR-Vని సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారు తన ITR ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకపోతే వాపసు ప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z