NRI-NRT

కూటమి విజయంలో ఎన్నారైల పాత్ర కీలకం-న్యూజెర్సీలో గుడివాడ ఎమ్మెల్యే రాము.

కూటమి విజయంలో ఎన్నారైల పాత్ర కీలకం-న్యూజెర్సీలో గుడివాడ ఎమ్మెల్యే రాము.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. న్యూజెర్సీలోని ఎన్నారైలు రాముకు ఆత్మీయ అభినందన సభ శుక్రవారం ఏర్పాటు చేశారు. కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో పెద్దసంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు.

ఎన్నారైలు గుడివాడ ప్రాంతంలో పరిశ్రమలు స్థానపించడానికి అనువుగా ఉంటుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాధర్ గారపాటి, శ్రీహరి మందాడి, సమతా కోగంటి, హరి ముత్యాల, రాధా నల్లమల్ల, జగదీశ్ యలమంచలి, రాజా కసుకుర్తి, లావు అంజయ్య చౌదరి, తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షలు టి జి కె మూర్తి, సాయి కృష్ణ బొబ్బా, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూ జెర్సీ తెలుగుదేశం, జనసేన, భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z