* 2024 ఏప్రిల్ – జూన్ మధ్యలో భారతదేశంలో ట్యాబ్ సేల్స్ భారీగా పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్’ (IDC) వెల్లడించింది. మూడు నెలల్లో 1.84 మిలియన్ యూనిట్ల ట్యాబ్ విక్రయాలు జరిగినట్లు.. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 128.8 శాతం పెరిగినట్లు సమాచారం. వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ ట్రాకర్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసింది. ఇది విక్రయాలు గణనీయంగా పెరగడానికి దోహదపడిందని తెలుస్తోంది. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌లు అన్నీ కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
* ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది. బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్‌డేట్‌లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
* రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది. 2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్‌లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్‌లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్‌ఈడీ పైలట్ లైట్లు, హెడ్‌లైట్, టెయిల్ లైట్ అప్‌డేటెడ్ ఎడిషన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్‌లో అయితే ఎల్‌ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.
* ప్రభుత్వ సంస్థ NBCC (ఇండియా) లిమిటెడ్ బోర్డు 1:2 నిష్పత్తిలో అర్హులైన షేర్‌హోల్డర్‌లకు బోనస్ షేర్లను(Bonus Shares) జారీ చేయడానికి ఆమోదించింది. దీని కింద కంపెనీ ప్రతి 2వ షేరుపై ఒక బోనస్ షేరును అందిస్తుంది. ఇందుకోసం రూ.90 కోట్ల విలువైన స్టోర్‌ను కంపెనీ వినియోగించుకోనుంది. బోనస్ షేర్ల జారీకి, రికార్డు తేదీని నిర్ణయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌బీసీసీ స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది. 1:2 నిష్పత్తిలో కంపెనీ షేర్‌హోల్డర్‌లకు బోనస్ షేర్లను జారీ చేయాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. అంటే రికార్డ్ తేదీ నాటికి అర్హత కలిగిన సభ్యులు కలిగి ఉన్న ప్రతి రెండు షేర్‌లకు ఒక కొత్త పూర్తిగా పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ పొందనున్నారు.
* గ్యాస్ (LPG Cylinder Prices) వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ప్రతినెలలాగే సెప్టెంబర్ 1న సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. దీంతో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.39 పెంచడంతో వాణిజ్య వినియోగదారులకు షాక్ తగిలింది. పెంచిన ధరలు ఆదివారం తెల్లవారుజాము నుంచే అమలులోకి వచ్చాయి. కేంద్రం అధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,691.50 రూపాయలకు పెరిగింది. చెన్నై- 1,855, కోల్‌కతా – రూ.1,802.50, ముంబయి- రూ.1,644 పలుకుతోంది. హైదరాబాద్‌లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి.
* మగువలకు కాస్త ఊరటనిచ్చే విషయమే ఇది. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. దీంతో బంగారం ధరలు పెరగడం పక్కా అని తెలుస్తోంది. కాబట్టి బంగారం కొనేవారికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,100కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కూడా ముంబయిలో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.
* ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ(Bank Holidays in September) బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నెలలో ఏకంగా 15 రోజులు సెలవులు రావడం గమనార్హం. ఇందులో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారం హాలిడేలు ఉన్నాయి. వీటితోపాటు వివిధ పండుగలకుసైతం సెలవులున్నాయి.
సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా
September 1: Sunday
September 4 (Wednesday): Tirubhav Tithi of Srimanta Sankardeva; Banks are shut in Assam.
September 7 (Saturday): Ganesh Chaturthi/Samvatsari (Chaturthi Paksha)/Varasiddhi Vinayaka Vrata/Vinayakar Chathurthi; Banks are shut in Gujarat, Maharashtra, Karnataka, Odisha, Tamil Nadu, Hyderabad – Andhra Pradesh, Hyderabad – Telangana and Goa.
September 8: Sunday
September 14 (Saturday): Karma Puja/First Onam; all banks are shut due to second Saturday and Karma Puja/First Onam celebrations in Kerala and Jharkhand.
September 15: Sunday
September 16 (Monday): Milad-un-Nabi or Id-e Milad (Birthday of Prophet Mohammad) (bara vafat); banks are shut in Gujarat, Mizoram, Maharashtra, Karnataka, Tamil Nadu, Uttarakhand, Hyderabad – Andhra Pradesh, Hyderabad – Telangana, Manipur, Jammu, Kerala, Uttara Pradesh, New Delhi, Chhattisgarh and Jharkhand.
September 17 (Tuesday): Indrajatra/Id-e-Milad (Milad-Un-Nabi); Banks are shut in Sikkim and Chhattisgarh.
September 18 (Wednesday): Pang-Lhabsol; Banks are shut in Assam.
September 20 (Friday): Friday following Eid-i-Milad-ul-Nabi; Banks are shut in Jammu and Srinagar.
September 21 (Saturday): Sree Narayana Guru Samadhi Day; Banks are shut in Kerala.
September 22: Sunday
September 23 (Monday): Birthday of Maharaja Hari Singh Ji; Banks are shut in Jammu and Srinagar.
September 28: Fourth Saturday
September 29: Sunday
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z