* సివిల్స్ పరీక్షల శిక్షణా సంస్థ శంకర్ ఐఏఎస్ అకాడమీ (Shankar IAS Academy)కి జరిమానా పడింది. 2022 సివిల్ సర్వీస్ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు గానూ కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (CCPA) చర్యలు చేపట్టింది. ఈ అకాడమీకి రూ.5లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సీసీపీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ సక్సెస్ రేటు, సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సుల గురించి ఈ కోచింగ్ ఇనిస్టిట్యూట్ తప్పుడు ప్రకటనలు (Misleading Ads) చేసిందని సీసీపీఏ గుర్తించింది. 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష కోసం శంకర్ ఐఏఎస్ అకాడమీ (Shankar IAS Academy) ఓ యాడ్ ఇచ్చింది. అందులో ఆల్‌ఇండియా లెవల్‌లో ఎంపికైన 933 మందిలో 336 మంది తమ అకాడమీలో శిక్షణ తీసుకున్నట్లు పేర్కొంది. ఇక, టాప్ 100లో తమ ఇనిస్టిట్యూట్ నుంచి 40 మంది అభ్యర్థులు ఉన్నట్లు ప్రచురించింది. దేశంలోనే ఉత్తమ ఐఏఎస్ అకాడమీ తమదేనంటూ ప్రకటనలో రాసుకుంది.
* హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భార్యాభర్తలు వెంకటేశ్ (40), వర్షిణి (33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.
* ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్‌లో 13 ఏళ్ల బాలికపై ప్రభుత్వ పాఠశాల ప్యూన్, అతడి సహచరుడు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఐదు నెలల తర్వాత బాలిక గర్భవతి అని తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం బాలిక రాత్రి వాష్‌రూమ్‌కి వెళ్లిందని, పాఠశాలలో పనిచేసే పంకజ్ మరియు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అమిత్ ఆమెను పట్టుకుని, ఖాళీగా ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అమిత్ బాలికపై అత్యాచారం చేయగా, పంకజ్ బయట కాపలాగా ఉన్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను నిందితులు బెదిరించారు. అయితే, శనివారం రోజు బాలిక ఐదు నెలల గర్భవతి అని తల్లి గుర్తించడంతో విషయం తెలిసింది. నిందితులపై అత్యాచారం ఆరోపణలతో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
* బిట్ కాయిన్ ఆన్ లైన్ గేమ్ తో మోసాలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ని, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో కలిసి ఆమె వివరాలను వెల్లడించారు. జిల్లాలో కడెం నుండి ప్రారంభించి ఇలా అన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమని తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఈ వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదని, లక్ష రూపాయలు చేతులు మారినట్లు చెప్పారు. ఈ కేసును విచారించడంలో ప్రతిభ చూపించినటువంటి పోలీసు అధికారులను అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z