Movies

30 years industry పృథ్వీకి “హాస్య నట కేసరి” బిరుదు

30 years industry పృథ్వీకి “హాస్య నట కేసరి” బిరుదు

కృష్ణవంశీ చిత్రం “ఖడ్గం”లో 30 years industry డైలాగ్‌తో ప్రాచుర్యం పొందిన ప్రముఖ హాస్య నటుడు పృథ్వీని అమెరికాలోని అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA-ఆప్త) “హాస్య నట కేసరి” బిరుదుతో సత్కరించింది. శనివారం నాడు వర్జీనియాలో నిర్వహించిన ఆ సంస్థ 16వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. తనకు ఈ గౌరవం ఇచ్చిన ఆప్తకు పృథ్వీ ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z