ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ శ్రీరామ్ విల్లివల్లమ్‌తో మాజీ మంత్రి, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ సోమవారం సమావేశమయ్యారు. తెలుగు వ్యక్తి, తొలి ఆసియన్-అమెరికన్ సెనేటర్‌గా డెమొక్రాట్ పార్టీ నుంచి ఎన్నిక కావడం తెలుగువారికి గర్వదాయకమని బుద్ధప్రసాద్ అభినందించారు.
తన తల్లి గుంటూరు జిల్లాకు చెందిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇల్లినాయిస్ రాష్ట్రం ద్వారా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఆకాంక్ష ఉందని శ్రీరామ్ విల్లివలమ్ అన్నారు. ప్రత్యేకించి భూగర్భ, మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణంలో తమ రాష్ట్రానికి ప్రత్యేకత ఉందని, తమ నిపుణల సేవలు అమరావతి నిర్మాణానికి ఉపయోగించడానికి సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనా దక్షత తమకు తెలుసని, ఏపీకి తోడ్పాటునందించడం కర్తవ్యంగా భావిస్తున్నానని శ్రీరామ్ పేర్కొన్నారు. సమావేశంలో ధరణి విల్లివాలమ్, డాక్టర్.శ్రీరామ్ శోంఠి, రజిత్ గాంగ్లి, కోడూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z