Business

మాధవి రాజీనామా చేయాల్సిందే-BusinessNews-Sep 06 2024

మాధవి రాజీనామా చేయాల్సిందే-BusinessNews-Sep 06 2024

* ఒకప్పుడు మొబైల్‌ ఇంటర్నెట్‌ అంటే చాలా ఖరీదైన అంశం. ఒక్కో ఎంబీ డేటాను ఆచితూచి వాడుకునేవాళ్లం. ఇక వాయిస్‌ కాల్స్‌ సంగతి సరేసరి. కాలింగ్‌ సదుపాయాన్ని నిమిషాల లెక్కన కొనుక్కునేవాళ్లం. భారత టెలికాం మార్కెట్‌లో జియో అడుగు పెట్టిన తర్వాత ఈ పరిస్థితులు మారిపోయాయి. నేడు జీబీలకు జీబీలు అలవోకగా వాడేసుకుంటున్నాం. గంటలకొద్దీ వాయిస్‌ కాల్స్‌ అపరిమితంగా మాట్లాడేసుకుంటున్నాం. దేశ టెలికం మార్కెట్‌లోకి రిలయన్స్ జియో ప్రవేశించి ఎనిదేళ్లు అవుతోంది. 2016 సెప్టెంబర్ లో ప్రారంభమైన నాటి నుంచి జియో వినూత్న ఆఫర్లతో యూజర్లను ఆకట్టకుంటూ అగ్రస్థానికి చేరి తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. సున్నా నుంచి 49 కోట్ల సబ్ స్క్రైబర్ బేస్ ను చేరుకుంది. అంతే కాకుండా సున్నా నుంచి 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ ను పొందింది. ఫలితంగా డాటా వినియోగంలో 2016లో 155వ స్థానంలో ఉన్న భారత్ నేడే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది. 2016లో సగటు జియో యూజర్‌ డేటా సగటు వినియోగం నెలకు 800 ఎంబీ కాగా ఇప్పుడది నెలకు 30 జీబీగా ఉంది.

* ఎలక్ట్రిక్‌ వాహనాలకు అందించే సబ్సిడీ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని, వినియోగదారులు స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోలు వైపు మొగ్ చూపుతున్న క్రమంలో విక్రయాలను ప్రోత్సహించడానికి ఇక ప్రోత్సాహకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. “నా అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇకపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్‌ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన. శిలాజ ఇంధన వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్‌ వాహనాలపై తక్కువ జీఎస్టీ విధించడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇప్పటికే ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు. ఇక భారీగా జరుగుతన్న పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధన దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉందన్నారు.అయితే ఇది పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులకు దారితీయదని స్పష్టం గడ్కరీ చేశారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ప్రతికూలంగా ముగిశాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ప్రపంచ సెంటిమెంట్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లపైన పడుతోంది. బీఎస్‌సీ సెన్సెక్స్ 151.48 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 82,201.16 వద్ద స్థిరపడగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53.60 పాయింట్లు లేదా 0.21 శాతం కోల్పోయి 25,145.10 వద్ద ముగిసింది. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 33 నష్టాల బారిన పడ్డాయి. అత్యధికంగా కోకా-కోలా ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.46 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో టైటాన్, ఎల్టీఐమైడ్‌ట్రీ, విప్రో, బీపీసీఎల్, ఐటీసీ ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 3.11 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.

* భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్‌ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు. తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్‌పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్ అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.

* మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త ‘మేబ్యాచ్ ఈక్యూఎస్’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). ‘లోటస్ ఎలెట్రే’ ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్‌ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు. మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.

* చాలా మంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికి లేదా కొత్త పద్ధతులు, విధానాలకు ఆకర్షితులై ఇండియా వదిలి విదేశాల్లో నివాసముండిపోతున్నారు. అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన ‘ప్రతీక గుప్తా, నేహా మహేశ్వరి’ దంపతులు జంట ట్యాక్స్ తగ్గుతుందని, ఎక్కువ పొదుపు చేయొచ్చని, ఇతరత్రా ప్రయోజనాల దృష్ట్యా యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌లో స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడటం వల్ల లాభాలు ఏంటనే విషయాలను కూడా వారు వెల్లడించారు. ప్రతీక గుప్తా అమెజాన్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్‌గా, నేహా శర్మ రియర్ ఎస్టేట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్ ఉద్యోగాలు చేశారు. ఇండియాలో పనిచేయడం వల్ల ఇంక్రిమెంట్స్ వచ్చేవి. అయితే దుబాయ్ లేదా అమెరికాలలో ఉద్యోగాలు చేసే చాలా డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు. దుబాయ్, అమెరికాల కంటే యూరప్ దేశాలలో జీవన నైపుణ్యం బాగుందని వారు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనుకునే వారు యూరప్‌ దేశాలకు రావడం తక్కువే. అయితే ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా కంటే కూడా యూరప్‌లో తక్కువ. ఇది మాత్రమే కాకుండా అక్కడ కొన్ని సర్వీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రతీక, నేహా చెప్పుకొచ్చారు. ఇక్కడ మన సంపాదనలో మూడు శాతం తప్పనిసరిగా ఆరోగ్యభీమాకు అందించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z