డిట్రాయిట్లో 2025 జూలైలో నిర్వహించే తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ప్రణాళిక కమిటీని నియమించారు. Novi Suburban Showplaceలో నిర్వహించబోతున్న ఈ సభల గురించిన సమాచారాన్ని సభల సమన్వయకర్త ఉదయ్ కుమార్ చాపలమడుగు వెల్లడించారు. అక్టోబర్ 19న కిక్ఆఫ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కు వాలంటీర్లుగా పనిచేయాలనుకునేవారు https://www.tanaconference.org/ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీలో సభ్యులు వీరే :
గంగాధర్ నాదెళ్ల (చైర్మన్) – నిధుల సేకరణ
శ్రీనివాస్ కోనేరు (కెవికె) (కో-కోఆర్డినేటర్) – ఆర్ధిక, ఆదాయ విభాగాలు
సునీల్ పాంట్ర (కాన్ఫరెన్స్ డైరెక్టర్) – సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు
కిరణ్ దుగ్గిరాల (కార్యదర్శి) – ప్రణాళికా సమన్వయం
జోగేశ్వరరావు పెద్దిబోయిన (కోశాధికారి) – వేదిక, హోటళ్లు మరియు భోజన ఏర్పాట్లు
నీలిమ మన్నె (తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి) – పోటీలు, అలంకరణలు, మహిళలు, మరియు పిల్లల కార్యకలాపాలు
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z